Sunday 15 March 2015

Devudaa Unnava

ఇది కవిత్వం కాదు కపిత్వం కాదు.  దేవుళ్ళను నమ్మే వాళ్ళను ఇది బాధించవచ్చు .. 


దేవుడా ఉన్నావా నువ్వు అసలున్నావా 
ఉంటే మరి నిర్భయ అరుపులు వినబడలేదా 
సహస్ర నామ స్తోత్రాలలో కళ్ళు కానకున్నావా 
నమాజు ప్రార్థనల మద్య మునిగిపోయున్నావా 
వినబడినా శిలువ నుంచి కదల లేకున్నావా 

కుక్కలు అసలు నీ గురించి పట్టించుకోవు 
సింహాలు నిన్ను మొక్కవు 
కచ్చితంగా నిర్భయ నీ గురించి తలచి ఉంటుందే , అయ్యో 
ఇంతకీ ఉన్నావా లేక నిర్భయ వెర్రిదంటావ 

ఇది మనుషుల కర్మ వలన  అయితే 
ఆ కర్మకి కారణం నువ్వు కాదా 
నిర్బయ నీ బిడ్డ , భార్య , చెల్లి కాదంటావా 
అయ్యుంటే ఆపేయ్ వాడినంటావ 

దేవుడి ఆజ్ఞ లేనిదే గడ్డి కదలదంట 
మరి ఈ గోరాన్ని ఎందుకు ఆజ్ఞాపించావు 
నువ్వు శాడిస్ట్ వా లేక మూర్కుడివా 
ఐనా ఇలాంటివి ఆపలేని చేతకానివాడివి నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి 











2 comments:

  1. ఉంటే ఈ కవిత తప్పక చదువుతాడులెండి :-)

    ReplyDelete