Friday 20 February 2015

Idandi Maha Bharatam pustaka sameeksha -- Review of Idandi Maha Bharatam by Ranganayakkamma

రామాయణ , భారతాలు మన దేశంలో ఒక భాగం . వీటి గురించి ప్రతి ఒక్కరికి కొంచో గొప్పో తెలిసే ఉంటుంది . కాని ఈ పుస్తకాలని పూర్తిగా చదివిన వాళ్ళు చాలా తక్కువ . అదీ గాక వాల్మీకి రామాయణం , వ్యాసుని భారతం సంస్కృతం లో ఉండడం తో వాటిని అనువదించిన వాళ్ళు editing & mixing చేసేశారు .  ఉదాహరణకు తెలుగులో  మొల్ల రామాయణం , తమిళం లో kamba రామాయణం , ఇలా దాదాపు 200 రామాయణం లు ఉన్నట్లు అంచనా .

"ఇదండి మహాభారతం "పుస్తకంలో  రంగనాయకమ్మ గారు , గంగూలీ గారి ఆంగ్లానువాదం , తెలుగులో కవి త్రయంది (T .T.D  వ్యాక్యానం )మరియు అప్పలస్వామి గారిది తీసుకున్నరు. ఈ పుస్తకం నిజంగా ఒక eye-opener అనే చెప్పాలి .  రచయిత్రి ధర్మరాజు character ని కామెడీ చేసేశారు . మనకి కూడా ఓవరాల్ కాన్సెప్ట్ మీద చిరాకు వస్తుంది.

bible ప్రకారం adam & eve valla సృష్టి start అవుతుంది , కానీ భారతం ప్రకారం బ్రహ్మ బొటన వేళ్ళు ద్వారా ఇద్దరు పుట్టి సృష్టి start అవుతుంది . రచయిత్రి చెప్పే మెయిన్ point , మొత్తం భారతం చదవండి మీరే తెలుసుకుంటారు అది తప్పుల తడక అని.  విమర్శలు ఎన్ని వచ్చిన ఆవిడా జడవక దీని విడుదల చేశారు . భార్యని జూదంలో పెట్టడం, కుల వివక్ష , లింగ బేదం చూపడం మీద విరుచుకు పడ్డారు .

ఇది నాస్తికులకు నచ్చుతుంది , ఆలోచనాపరులను ఆలోచింపచేస్తుంది , ఆస్తికులను ఇబ్బంది పెడుతుంది.  ఈ పుస్తకం ఒక్కసారైనా చదవాల్సిందే .. ఆవిడ interview కొరకు క్రింది video చూడండి .