Sunday 1 March 2015

Naa Modati Pelli Choopulu

    మా పేరెంట్స్ పెళ్లి చేసుకో అని చాల రోజులుగా  అడుగుతున్నా నేను పెద్దగా interest చూపలేదు ..marriage అయితే commitments ఎక్కువ అవుతాయి , దానితో పాటు నాకు ఇంకా further education కి వెళ్ళాలని .. దానితో కొన్ని సంబందాలు పోయాయి . నా cousin కి two years back పెళ్లి samandaalu చూడడం మొదలు పెట్టారు .   అప్పుడు మా అత్తయ్య వాలు online లో కూడా చూడరా అని చెప్పడంతో కొన్ని  matrimony సైట్స్ లో ఎకౌంటు open చేసాను  .  కాని మా cousin  వీటి మీద పెద్దగా interest చూపలేదు .  matrimony site  వాడు రోజుకొకటి,  వారానికొకటి చొప్పున చాలా mails  పంపుతున్నాడు.  తీరా నాకోసమే ఓపెన్ చేసుకున్నట్లైంది . తెలిసిన వాళ్ళ ద్వారానే సంబంధం కుదిరి ఈ మద్యనే మా cousin కి  పెళ్లి జరిగింది  .   ఒకరోజు బోర్ కొట్టి matrimony site చూడడం మొదలు పెట్టాను . నా search కి ఒక 1600 profiles వచ్చాయి . ఇలా చూసిన వాటిల్లో  కొన్ని బాగున్నాయి .  కాని నాకు proceed కాబుద్ది కాలేదు .

Last month, మా cousin  engagement attend అయ్యి ఇంటికి రాగానే మా మేనేజర్ నుంచి phone ..high priority issue ఒకటుంది వెంటనే లాగిన్ అవ్వమని . ఇదేంట్రా బాబు ఈ టైములో అనుకుంటూ login అయ్యి issue fix చేసాక  build చెయ్యడానికి టైం పడుతుంటే మెయిల్ ఓపెన్ చేశాను . అంతలో ఒక matrimony  site నుంచి mail వచ్చింది ఈరోజు మీ mutual matches  అంటూ .   సరే అని ఓపెన్ చేస్తే ఒక ఐదుగురు అమ్మాయిల photos , కొదిగ్గా  description . అందులో ఒక అమ్మాయి, పేరు శ్రావ్స్ , తెగ నచ్చేసింది . google uncle ని అడిగితే తనకు ఆ అమ్మాయి బాగా తెలుసని చాలా details  చెప్పాడు .  తనకు నాలాగే running , theatre  అంటే istam అని facebok aunty cheppindi . ఇంకో surprising thing ఏంటంటే తను నేను work చేసే  క్లైంట్ company లో employee .

super  అనుకుంటూ మరుసటి రోజు ఆఫీసుకి వెళ్ళాను . ఇంట్లో చెప్పాలా , లేక ఫస్ట్ ఆ అమ్మాయిని కలవాల , లేక matrimony  site  వాడికి డబ్బు కట్టాలా అర్థం కాలేదు . నా గోల్స్ అన్ని  మేము wait చెస్తాం అనడం మొదలు పెట్టాయి . ఇంతలో ఒక టెన్షన్,  జాతకం కలవక పోతే ఎలా అని . arranged  marriages లో జాతకంది main role . దానితో మా friend కి కాల్ చేసి విషయం చెప్పి టెన్షన్ తో keyboard కొడుతుంటే , వాడి నుంచి కాల్ , kk నీ జాతకం super గా match  అయ్యిందిరా అని. ఆ ఆనందంలో ఉండగా మా టీంతో  lunch కి పోదామని బయలుదేరాను . ప్లేట్ తీసుకొచ్చి మేము regular గా కూర్చునే place లో కూర్చుంటే , అద్బుతం అన్నట్లు sravs నా opposite line లో తన team తో వచ్చి కూర్చొంది . నిజంగా తానో కాదో అని అలా చూస్తుండిపోయాను .  ఆ ఆఫీసు కి వివిధ బ్రాంచులు , మళ్లి మా బ్రాంచ్లో చాలా buildings , ఇంకా ఒక నాలుగైదు cafetarias ఉన్నాయి .  , తను తినేయ్ లోపు నేనూ తినేసాను . ఎందుకో  south meals  ఆ రోజు tasty గా అనిపించాయి.  normal గా company internal portal లో అన్ని details దొరుకుతాయి మా friend ని url kanukkoni వెంటనే నా cubicle కి పరుగు తీసాను. portal లో చూస్తే తను మా building లో ఉంటుందని తెలిసింది. వెంటనే తన ఫ్లోర్ కి వెళ్ళాను . తను తన cubicle లో లేచి నిలబడి హెయిర్ ని adjust చేసుకుంటోంది. ఇంక ఆలస్యం చెయ్య బుద్దవలేదు . ఎక్కడ miss  అయిపోతుందేమో అనిపించింది . వెంటనే పక్కనే ఉన్న pantry కి వచ్చి కాల్ చేశాను . "నేను కార్తిక్ ని , sravs గారా మాట్లాడేది" అని అడిగాను . తను "ఎవరు " అంది . "నేను same company లో work చేస్తున్నాను , మీరు pantry కి వస్తారా " అని అడిగాను .   "హా ok !!" అంది . ఇక ఒకటేయ్ tension .
నాకు surya s/o krishnan సినిమా ఇష్టం .. అందులో ఈ scene లో లా ఉంది నా పరిస్తితి.

నేను coffee తీసుకుంటూ ఉండగా , తను చేతిలో laptop తో వచ్చింది .  నేను right hand లో కాఫీ తో , లెఫ్ట్ హ్యాండ్ తో హాయ్ అన్నట్లు signal  ఇచ్చాను .
 తను " హా చెప్పండి " అంది .
 " hi , నేను కార్తీక్ , మీ profile ----- matrimony site లో చూశాను , fb లో  chooste same company తెలిసింది, portal లో  phone  దొరికింది "  ,(మాటలు correct గా frame చెయ్యలేక పోయాను..first time కదా :) )
"oh  ఓకే ",
"మీరు free గా ఉంటే ఒక ten minutes మాట్లాడుదాం",
"నాకు ఇప్పుడు meeting  ఉంది . మీ full  name  ఏంటి . మీటింగ్ అయిన  తర్వాత ping  చేస్తాను " ,
".......                 ",
"మీ designation " ,
"sr.developer from  so & so company . ఇక్కడ consultant గా వచ్చాను ",
"ఓకే , నేను meeting వెళ్ళాలి ".
"ఓకే bye ".
అంతే  మీటింగ్ over .
 మాట్లాడాను కాని నాకే ఎందుకో కొత్తగా ఉంది . తనకి వెంటనే call చేశాను " హలో అండి , నేను "
"హా చెప్పండి"
"మీరేమైనా embarasssing గా feel అయ్యారా !"
"నో , లేదు "
"ok  fine , site లో చూసి నేరుగా వచ్చి మాట్లాడాను కదా అందుకే ఏమైనా అనుకున్నారేమో అని, ok  మరి bye "
"bye "

 కిందకొచ్చి , నా communicator  open చేసి , తన id కొట్టి choosanu, "In meeting " అని ఉంది . నా work  చేస్తూ,  మద్య మద్య లో ఎప్పుడెప్పుడు తన status "available " అని చూపిస్తుందా అని చూస్తున్నాను . urgent issue  valla కొద్దిసేపు busy అయ్యి, sudden గా గుర్తొచ్చి చూస్తె తన status "signed off". ఓకే అనుకుంటూ టెన్త్ క్లాసు results కోసం wait చేసినంత tension తో తన కాల్ కోసం వెయిట్ చేశాను . కాని ఆ రోజు నో response.  మరుసటి రోజు మద్యాహ్నం వరకు no  response. మా friend ఒకడు కాల్ చేసి "ఏమ్మయిపోయవురా ! నిన్న నీ phone కి chaala సార్లు కాల్ చేశాను , కలవలేదు అనడంతో ", వెంటనే తనకి call చేశాను . తన phone  switched off . అలా ఇంకో two టైమ్స్ కాల్ చేసిన తర్వాత evening కాల్ కలిసింది .
"sravs గారు , నేను కార్తీక్ ని , నిన్న మిమ్మల్ని కలిశాను "

"హా అవును , చెప్పండి "

"అదేనండి , మీరు free గా ఉంటే మాట్లాడుదామని , office లో network problem , మీరేమ్మాన call చేసారేమో  అని  "

"ఓకే అండి , నేను కొంచెం busy గా ఉన్నాను , మళ్ళి కాల్ చేస్తాను "

"ఓకే అండి , fine  bye ".
evening అయింది , no response . మరుసటి రోజు evening అయింది , నో response . మాములుగా ఒకసారి అడిగితే అడిగినట్లు, రెండో సారి అడిగితే అడుక్కున్నట్లు అని feel అయ్యే రకం నేను . (కొంచెం over కదా ) , అయ్యినప్పటికి తన కోసం ఒక step దిగచ్చు అనిపించి కాల్ చేశాను , నా regular number lift చెయ్యలేదు , వేరే నెంబర్ నుంచి కాల్ చేశాను , కాల్ లిఫ్ట్ చేసింది. (కొంచెం disappointment  :(  ).

"sravs  గారా ? నేనండి కార్తీక్ ని ,  "
"హా ఆ చెప్పండి '
"అదేనండి మీరు free గా ఉంటే ఒక ten minutes మాట్లాడుదామని, మీ నుంచి response కోసం wait చేస్తున్నాను, ఏమి లేక నేనే call చేశాను "
"లేదండి నేను బయట ఉన్నాను , నేనే మళ్ళి call చేస్తాను "
"పర్లేదండి , మీకు నచ్చలేదంటే చెప్పచు , It's fine "
"అలా కాదు , నేను outside  ఉన్నాను , don't mind, ఇప్పుడు మాట్లాడలేను , మళ్ళి  call చేస్తాను "
"ok అండి మరి bye "
"bye "

  ఈసారి call కోసం three days wait చేశాను , no response . ఇంక తనని ఇబ్బంది పెట్ట తలచుకోలేదు .( నాకూ sister ఉండడంతో తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు) తన number ని delete చేద్దాం అనుకుంటూ last time ఒక message type chesanu. (ఈ messages నేను delete chesina తర్వాత ఈ blog రాయడం వల్లన exact గా టైపు చెయ్యట్లేదు)
"sravs గారు, మీ response kosam wait chesanu , I feel that you are not interested and I don't want to disturb you again , if  not let me know "

message type చేసి పంపే ముందు, samsung default hanging  వలన call poyindi. వెంటనే cut చెసను. కాని తనకు ring వెళ్ళడంతో తిరిగి చేసింది .. call ని disconnect చేసి message పంపాను . 

"karthik గారు , I have some other plans and I am not very much interested in marriage right now . My parents uploaded profile , All the best for your future "

"ok , I too didn't thought of marriage until I saw your profile . Anyways all the best for your other plans ".

అంతే తన number delete చేశాను . కాని రోజూ cafetaria లో అప్పుడప్పుడు తను కనిపిస్తోంది , నా failure గుర్తొస్తోంది .


so many thoughts.. తనని కలిసినప్పుడు , without tuck , beard తో ఉన్నాను . బహుశా అది నా mistake ఏమో అని రోజూ మంచి dress తో వెళ్తున్నా . వెర్రి వెయ్యి రకాలంటే ఇదేనేమో !!
 company start చేయ్యలనుకునేవాడికి designation తో పని ఏంటి; package , work బాగుంటే ఏయ్ కంపెనీ అయితే ఏంటి . మేము steve jobs భక్తులం . ఇది తనకు ఎలా చెప్పగలను. 
  she might have thought that who is this idiot calling and coming directly. or whether she didn't looked upon me as a better fit and she is sensitive so that she didn't tell the real reason?? or Is she really not looking out for marriage right now ??...don't know..what is the reason.

ఈ smart phones తో బలే తల నొప్పి , number delete చేసినా ఒక నాలుగు numbers type చెయ్యగానే తన number చూపిస్తోంది . ofcourse గుర్తుండి పోయిందనుకోండి . అలా జరిగిందండి .. 

2 comments: